---Advertisement---

కథ చెప్పితే బైక్ మీదే.. కిర‌ణ్ అబ్బ‌వ‌రం బంప‌ర్ ఆఫ‌ర్‌

కథ చెప్పితే బైక్ మీదే.. కిర‌ణ్ అబ్బ‌వ‌రం బంప‌ర్ ఆఫ‌ర్‌
---Advertisement---

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram,) తన తాజా చిత్రం ‘దిల్‌రుబా’(Dilruba) కోసం అభిమానులకు ఆసక్తికరమైన ఛాలెంజ్ విసిరాడు. ఈ సినిమా కథను కచ్చితంగా చెప్పగలిగిన వ్యక్తికి, తన సినిమా కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన బైక్‌ను బహుమతి(Bike Giveaway)గా ఇస్తానని ప్రకటించాడు.

ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ “ఈ బైక్ నాకు చాలా ప్రత్యేకం. మా ఆర్ట్ డైరెక్టర్ ఎంతో కష్టపడి దీన్ని డిజైన్ చేశారు. అందుకే, ఇది నిజమైన సినీ ప్రేమికుడి చేతిలో ఉండాలని అనుకుంటున్నా” అని చెప్పాడు. అంతే కాదు, బైక్ గెలుచుకున్న లక్కీ విన్నర్‌తో ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలనుంది అంటూ మరింత ఆసక్తిని రేపాడు. ఇప్పుడు అందరి దృష్టి ‘దిల్‌రుబా’ కథపైనే ఉంది. మరి, ఎవరు ఈ బైక్ గెలుచుకుంటారో చూడాలి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment