టాలీవుడ్ యువహీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) తండ్రి (Father) అయ్యారు. ఆయన భార్య, నటి రహస్య గోరఖ్ (Rahasya Gorak) పండంటి మగబిడ్డకు (Baby Boy) జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కిరణ్ అబ్బవరం స్వయంగా తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా ఒక బ్యూటిఫుల్ ఫోటోను జత చేస్తూ వెల్లడించారు. హనుమాన్ జయంతి రోజే తండ్రి అయ్యానని, తన కొడుకు పాదాలకు ముద్దులు పెట్టుతూ ఉన్న ఫొటోను షేర్ చేసి “జై శ్రీరామ్” (Jai Shree Ram) అంటూ కిరణ్ ట్వీట్ చేశారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు, సహచరులు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో కిరణ్ అబ్బవరం దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ప్రేమలో నుంచి పెళ్లికి, ఇప్పుడు పేరెంట్స్
కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్‌లు “రాజా వారు రాణి గారు” సినిమాలో జంటగా నటించారు. వెండితెరపై జంటగా అలరించిన ఈ జంట.. సినిమా షూటింగ్ సమయంలో వీరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. కొంతకాలం ప్రేమలో ఉన్న తర్వాత వారు పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడివారు తల్లిదండ్రులుగా కొత్త జీవితాన్ని ప్రారంభించారు.
అభిమానుల నుంచి శుభాకాంక్షల వెల్లువ
తాజాగా తన కొడుకు ఫొటోతో కిరణ్ చేసిన భావోద్వేగ పోస్ట్ అభిమానుల హృదయాలను తాకింది. శుభవార్తను తెలుసుకున్న సినీ ఇండస్ట్రీతో పాటు నెటిజన్లు, ఫ్యాన్స్ అందరూ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.








