లండన్ (London)లోని క్లారెన్స్ హౌస్ (Clarence House)లో బ్రిటన్ (Britain) రాజు (King) చార్లెస్ III (Charles III)ని టీమిండియా (Team India) పురుషులు (Men), మహిళా (Women) క్రికెట్ జట్లు (Cricket Teams) మంగళవారం (జూలై 15) కలిశాయి. లార్డ్స్‌లో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్‌లో 22 పరుగుల తేడాతో ఓటమిపాలైన అనంతరం భారత జట్లు రాజు చార్లెస్‌ను కలవడం విశేషం.

ఈ సందర్భంగా రాజు చార్లెస్ భారత ఆటగాళ్లతో ఆత్మీయంగా మాట్లాడారు. లార్డ్స్‌లో జరిగిన ఇంగ్లండ్, భారత్ మూడో టెస్ట్ మ్యాచ్‌లోని హైలైట్స్‌ను తాను చూశానని ఆయన పేర్కొన్నారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఐదో రోజు త్వరగా ఎనిమిది వికెట్లు కోల్పోయినప్పటికీ, చివరికి కేవలం 22 పరుగుల తేడాతోనే ఓడిపోయిందని ప్రస్తావించారు. చివరి వికెట్‌గా మహ్మద్ సిరాజ్, షోయబ్ బషీర్ బౌలింగ్‌లో బంతి స్టంప్స్‌కి తగిలి అవుటైన విషయాన్ని బ్రిటన్ రాజు చార్లెస్ ప్రత్యేకంగా గుర్తుచేసుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.









