గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్(Ram Charan) హీరోయిన్ గుడ్‌న్యూస్ చెప్పింది. కియారా అద్వానీ(Kiara Advani) తల్లి కాబోతోంది. ఈ వార్తను స్వయంగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. తమ జీవితంలోకి చిన్నారి రాబోతున్నట్లు హింట్ ఇస్తూ ఓ ప్రత్యేకమైన ఫొటోను షేర్ చేసింది కియారా.
కియారా సిద్ధార్థ్ మల్హోత్రా(Sidharth Malhotra)ని 2023లో వివాహం చేసుకుంది. తమ జీవితంలోకి గొప్ప గిఫ్ట్ త్వరలో రాబోతోందని కియారా చేసిన పోస్టు ఇన్‌స్టాలో వైరల్‌గా మారింది. అభిమానులు కూడా ఈ జంటకు కంగ్రాట్స్ చెబుతున్నారు. పోస్ట్‌ను షేర్ చేస్తున్నారు.
టాలీవుడ్‌లో కియారా జర్నీ
హిందీలోనే కాదు, తెలుగులోనూ కియారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. భరత్ అనే నేను, వినయ విధేయ రామ, ఇటీవల విడుదలైన గేమ్ ఛేంజర్ వంటి సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకుల మనసు గెలుచుకుంది.