తాడిపత్రి (Tadipatri) మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి (Former MLA Kethireddy Pedda Reddy) ఏపీ హైకోర్టులో (AP High Court) ఊరట (Relief) లభించింది. సొంత నియోజకవర్గం తాడిపత్రి వెళ్లేందుకు కోర్టు ఆయనకు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. ఆయనకు రక్షణ కల్పించేందుకు తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పోలీసులకు (State Police) ఆదేశాలు జారీ చేసింది.
కేతిరెడ్డి నివాసం వద్ద గుర్తుతెలియని వ్యక్తులు
ఇదిలా ఉండగా, కేతిరెడ్డి నివాసం (Kethireddy Residence) సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు టిప్పర్ వాహనంలో రాళ్లను పడేసి వెళ్లిన ఘటన కలకలం రేపింది. ఈ విషయంపై పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇది కేతిరెడ్డిపై దాడికి ముందస్తు యత్నమా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాడిపత్రి నియోజకవర్గ యాక్టీవ్ పాలిటిక్స్‌లోకి కేతిరెడ్డి మళ్లీ రీఎంట్రీ (Re-Entry) ఇవ్వబోతుండడంతో, టీడీపీ (TDP) నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy) తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. “కేతిరెడ్డి వస్తే ఊరుకోము” అంటూ ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
వేడెక్కుతున్న తాడిపత్రి రాజకీయం..
కేతిరెడ్డికి హైకోర్టులో ఊరట లభించడంతో తాడిపత్రి రాజకీయాల్లో మళ్లీ ఆసక్తికర మార్పులు సంభవించనున్నాయన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో అక్కడ పరిస్థితి ఎలా మలుపు తిరుగుతుందో చూడాలి. లాంగ్ గ్యాప్ తరువాత కోర్టు ఆదేశాలతో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు.