కేరళ రాష్ట్రం (Kerala State) దేశంలోనే సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. ముఖ్యమంత్రి (Chief Minister) పినరయి విజయన్ (Pinarayi Vijayan) నేతృత్వంలోని చరిత్ర సృష్టించింది. రాష్ట్రంలో పేదరికాన్ని (Poverty) విజయవంతంగా నిర్మూలించి ‘అత్యంత పేదరిక రహిత రాష్ట్రం’ (Extreme Poverty Free State)గా కేరళ అవతరించింది. కేరళ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నవంబర్ 1న ముఖ్యమంత్రి ఈ చారిత్రక ప్రకటన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సినీ తారలు మమ్ముట్టి, మోహన్ లాల్, కమల్ హాసన్ వంటి ప్రముఖులు హాజరు కానున్నారు.
పేదరిక నిర్మూలన ప్రాజెక్ట్ విజయం
పేదరికాన్ని నిర్మూలించిన మొదటి భారతీయ రాష్ట్రంగా కేరళ నిలిచిందని మంత్రి ఎంబీ రాజేష్ మరియు విద్యా మంత్రి శివన్‌కుట్టి ప్రకటించారు. ఈ ప్రకటనను తిరువనంతపురం సెంట్రల్ స్టేడియంలో ముఖ్యమంత్రి చేయనున్నారు.
2021లో ప్రారంభించిన పేదరిక నిర్మూలన ప్రాజెక్ట్‌లో భాగంగా, ఆశా కార్యకర్తలు, స్థానిక ప్రతినిధుల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో 64,006 కుటుంబాలు అత్యంత పేదరికంలో ఉన్నట్లు గుర్తించారు. ఈ కుటుంబాల కోసం ప్రభుత్వం సమగ్ర సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసింది.
ఉచితంగా చికిత్సలు, ఆరోగ్య సంరక్షణ. పేదలకు ఉచితంగా ఇళ్ల స్థలాల కేటాయింపు, గృహ నిర్మాణం. జీవనోపాధి కార్యక్రమాలు మరియు సామాజిక సంక్షేమ సహాయం. ఈ కార్యక్రమాలన్నిటినీ సీఎంవో నేరుగా పర్యవేక్షించడం విశేషం. దీనికోసం 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.80 కోట్లు, 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.50 కోట్లు ఖర్చు చేశారు.
కీలక పురోగతి వివరాలు
3,913 ఇళ్లు నిర్మించారు. 1,338 కుటుంబాలకు భూమి ఇచ్చారు. 5,651 కుటుంబాలకు ఇళ్ల మరమ్మతుల కోసం ఒక్కొక్కరికి రూ.2 లక్షలు అందించారు. 21,263 మందికి రేషన్ కార్డులు, ముఖ్యమైన పత్రాలను అందించారు. దీంతో కేరళ రాష్ట్రం దేశంలో మొట్టమొదటి అత్యంత పేదరిక రహిత రాష్ట్రంగా ఆవిర్భవించింది.





 



