కేరళ సీఎం ఆఫీస్‌, నివాసానికి బాంబు బెదిరింపు

కేరళ సీఎం ఆఫీస్‌, నివాసానికి బాంబు బెదిరింపు

కేరళలో (Kerala) ఇటీవల బాంబు బెదిరింపులు (Bomb Threats) తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా, రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం (Chief Minister’s Office) మరియు ఆయన అధికారిక నివాసమైన క్లిఫ్ హౌస్‌ (Cliff House) కు గుర్తు తెలియని వ్యక్తులు బాంబు బెదిరింపు మెయిల్ (Mail) పంపించారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అప్రమత్తమై, బాంబ్ స్క్వాడ్ (Bomb Squad) సాయంతో విస్తృతమైన తనిఖీలు చేపట్టారు. ఇదే తరుణంలో, తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం మరియు రైల్వే స్టేషన్‌లకు కూడా ఇటీవల బెదిరింపు మెయిళ్లు రావడం, కేరళ అధికార యంత్రాంగం ఒక్క‌సారిగా అప్రమత్తమైంది. ప్రస్తుతం పోలీసు శాఖ అలర్ట్ మోడ్‌ (Alert Mode)లో ప‌నిచేస్తూ ప్రతి అనుమానాస్పద క‌ద‌లిక‌ను పర్యవేక్షిస్తోంది. మెయిల్ ఎవ‌రు పంపించారు అనే విష‌యంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ సంఘ‌ట‌న‌పై మ‌రింత స‌మాచారం తెలియాల్సి ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment