---Advertisement---

కేజ్రీవాల్‌ ఇంటి వద్ద ఉద్రిక్తత.. ఆ వ్యాఖ్య‌లే కార‌ణం

కేజ్రీవాల్‌ ఇంటి వద్ద ఉద్రిక్తత.. ఆ వ్యాఖ్య‌లే కార‌ణం
---Advertisement---

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత ప‌రిస్థితులు చోటు చేసుకున్నాయి. పూర్వాంచల్ ప్రజలపై ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో, బీజేపీ ఆధ్వర్యంలో పూర్వాంచల్ సమ్మాన్ మార్చ్ పేరుతో నిరసన ర్యాలీ నిర్వహించారు.

బీజేపీ శ్రేణులు ఫిరోజ్ షా రోడ్డులోని కేజ్రీవాల్ ఇంటివద్దకు చేరుకుని నినాదాలు చేస్తూ, పూర్వాంచల్ ప్రజలపై కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, పూర్వాంచల్ వాసులకు క్షమాపణ చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

పోలీసుల చొరవ
నిరసన క్రమంలో పోలీసులు బీజేపీ కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నం చేయగా, ఇరువర్గాల మధ్య వాగ్వాదం తలెత్తింది. పోలీసులు వాటర్ స్ప్రేలను ఉపయోగించి ఆందోళన కారులను చెదరగొట్టారు. ఈ క్రమంలో పలువురు నిరసన కారులను అరెస్టు చేసి, అక్కడి నుంచి తరలించారు. ఈ వివాదం ఢిల్లీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పూర్వాంచల్ ప్రజల మనోభావాలు దెబ్బతీయ‌కూడదని, ఇరు వర్గాలు శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలని పలువురు కోరుతున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment