నటి కీర్తి సురేష్ తన కొత్త లైఫ్‌లో అడుగుపెట్టింది. తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనితో గోవాలో గ్రాండ్‌గా వివాహం చేసుకుంది. హిందూ సంప్రదాయంలో ఒకసారి, క్రిస్టియన్ సంప్రదాయంలో మరోసారి కీర్తి-ఆంటోనిల వివాహం జరిగింది. కీర్తి సురేష్ పెళ్లి ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.
పెళ్లి తరువాత కీర్తి తన మూవీ ప్రమోషన్‌లో పాల్గొంది. కీర్తి నటించిన బాలీవుడ్ మూవీ బేబీ జాన్ ఈనెల 25న విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్‌లో కీర్తి పాల్గొని మోడ్రన్ రెడ్ డ్రెస్‌తో మెరిసింది. మంగళసూత్రం మెడలో ధరించి మరీ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న కీర్తిని ఆమె అభిమానులు తెగ పొగిడేస్తున్నారు.
నెటిజన్ల స్పందనలు
కీర్తి మోడ్రన్ లుక్‌లో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో పెద్ద సంచలనం సృష్టించగా, కొందరు మాత్రం “పెళ్లి తర్వాత కాస్త గ్యాప్ తీసుకుంటే బాగుండేది” అని కామెంట్ చేస్తున్నారు. మరికొందరికి మాత్రం ఆమె స్పిరిట్ ఇన్‌స్పిరేషన్‌గా కనిపిస్తోంది.