కేసీఆర్ కుటుంబంలో విషాదం

కేసీఆర్ కుటుంబంలో విషాదం

బీఆర్ఎస్ అధ్య‌క్షుడు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు (కేసీఆర్) కుటుంబంలో విషాదం నెల‌కొంది. కేసీఆర్ ఐదో సోదరి చీటి సకలమ్మ (82) శుక్ర‌వారం రాత్రి తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా వయోభారం, అనారోగ్యంతో బాధపడుతున్న సకలమ్మ సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మృతదేహాన్ని హైదరాబాద్ ఓల్డ్ అల్వాలోని ఆమె నివాసానికి తరలించారు. సకలమ్మ భర్త కొన్నేళ్ల క్రితం కన్నుమూశారు. వీరికి ముగ్గురు కుమారులు ఉన్నారు. సకలమ్మ మృతితో కేసీఆర్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

Join WhatsApp

Join Now

Leave a Comment