కేసీఆర్, కేటీఆర్ ఫొటోలతో.. జగన్ నివాసం వద్ద భారీ కటౌట్

కేసీఆర్, కేటీఆర్ ఫొటోలతో.. జగన్ నివాసం వద్ద భారీ కటౌట్

ఏపీ మాజీ సీఎం (Former Andhra Pradesh Chief Minister), వైసీపీ(YSRCP) అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి (YS Jagan Mohan Reddy) పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ తాడేపల్లిలోని (Tadepalli) ఆయన నివాసం వద్ద భారీ కటౌట్ వెలిసింది. జగన్ జన్మదినం సందర్భంగా వెలిసిన ఈ ఫ్లెక్సీ (Flex Banner) స్థానికంగా ఆకర్షణగా మారింది.

ఈ కటౌట్‌లో వైఎస్ జ‌గ‌న్ ఫొటోతో పాటు తెలంగాణ (Telangana) మాజీ సీఎం కేసీఆర్‌(KCR), బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఫొటోలు ఉండటం ఆసక్తికరంగా మారింది. జగన్‌తో పాటు కేసీఆర్, కేటీఆర్ చిత్రాలు ఒకే ఫ్లెక్సీలో కనిపించడంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. జగన్–కేసీఆర్ మధ్య ఉన్న స్నేహపూర్వక సంబంధాలకు ఇది నిదర్శనంగా పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరింత విశేషం ఏంటంటే, ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన వ్యక్తి తెలంగాణలోని శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన వ్య‌క్తి. డాక్ట‌ర్ ర‌వీంద‌ర్ యాద‌వ్ (Dr. Ravinder Yadav) ఈ క‌టౌట్‌ను ఏర్పాటు చేశారు. తెలంగాణకు చెందిన వ్యక్తి అభిమానంతో ఏపీలో జగన్ నివాసం వద్ద కటౌట్ ఏర్పాటు చేయడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. జగన్ పుట్టినరోజు సందర్భంగా వెలిసిన ఈ ఫ్లెక్సీ రాజకీయంగా మరోసారి చర్చకు దారి తీసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment