బీఆర్ఎస్ అధినేత (BRS Leader), మాజీ ముఖ్యమంత్రి (Chief Minister) కే.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) (KCR) ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందన యశోద ఆసుపత్రి (Yashoda Hospital) వర్గాలు వెల్లడించాయి. తీవ్ర అనారోగ్యంతో బుధవారం ఆసుపత్రిలో చేరిన ఆయనకు, వైద్యులు పలు పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆయనకు అధిక షుగర్ స్థాయిలు మరియు తగ్గిన సోడియం స్థాయిలు ఉన్నట్లు నిర్ధారించారు.
వైద్యుల బృందం అందించిన చికిత్సతో కేసీఆర్ ఆరోగ్యం మెరుగుపడినట్లు తెలుస్తోంది. జ్వరం (Fever) తగ్గడంతో ఆయన సాధారణ స్థితికి వచ్చారని సమాచారం. ప్రస్తుతం ఆయన షుగర్, సోడియం స్థాయిలు కూడా నియంత్రణలోకి వచ్చినట్లు వైద్యులు తెలిపారు. అంతా సక్రమంగా ఉంటే, కేసీఆర్‌ను గురువారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది.
డిశ్చార్జ్ (Discharge) అనంతరం కేసీఆర్ నందినగర్ (Nandinagar)లోని తన నివాసానికి చేరుకుంటారు. మరో రెండు రోజులపాటు అక్కడే విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంది. అనంతరం ఆయన మీడియా సమావేశం నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. నిన్న బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ ఉత్సాహంగా చిట్‌చాట్ చేసిన విషయం తెలిసిందే.