ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ మరోసారి బుల్లితెరపై సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ (KBC) 17వ సీజన్‌తో ఆయన అలరించనున్నారు. ఈ షో ఆగస్టు 11 నుంచి ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని సోనీ టీవీ అధికారికంగా ప్రకటించింది, అందులో ఈసారి కూడా అమితాబ్ వ్యాఖ్యాతగా వ్యవహరించున్నారు.
25 ఏళ్ల క్రితం మొదలు.. బిగ్‌బీ పారితోషికం!
ఈ క్రమంలో బిగ్‌బీ పారితోషికం ఎంత ఉండొచ్చు? అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. బీటౌన్‌లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, అమితాబ్ ఒక్కో ఎపిసోడ్‌కు ఏకంగా రూ.5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట! 25 ఏళ్ల క్రితం ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ షో మొదలైంది. బిగ్‌బీ అడిగే ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పినవారు రూ.1 కోటి గెలుచుకునే అవకాశం ఉంటుంది. దీనికి సెలబ్రిటీలను కాకుండా సామాన్యులనే పార్టిసిపెంట్‌లుగా ఎంపిక చేసుకుంటారు. అందుకే ఈ షోకు ఇంత క్రేజ్ లభించింది!
తెలుగులోనూ.. సినిమాలతో బిజీబిజీ!
బిగ్‌బీ హోస్టింగ్, కోటి రూపాయల ప్రైజ్‌మనీతో.. రియాలిటీ షోలలోనే కేబీసీ సరికొత్త సంచలనంగా నిలిచింది. ఇదే షో తెలుగులో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ పేరిట ప్రారంభమైంది. మొదటి మూడు సీజన్లు నాగార్జున, నాలుగో సీజన్ చిరంజీవి, ఐదో సీజన్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేశారు. ఆ తర్వాతేమైందో కానీ తెలుగులో ఈ షోను కొనసాగించలేదు.
అమితాబ్ సినిమాల విషయానికి వస్తే, ఆయన ప్రస్తుతం ‘సెక్షన్ 84’ మూవీ చేస్తున్నారు. దీనితో పాటు బిగ్‌బీ చేతిలో.. ‘బ్రహ్మాస్త్ర 2’, ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్ సినిమాలున్నాయి.