కాంగ్రెస్ నాయకులు “దొంగ దీక్షలు కాదు.. నిజమైన దీక్షలు చేయాలి!” — ఎమ్మెల్సీ కవిత

కాంగ్రెస్ నాయకులు "దొంగ దీక్షలు కాదు.. నిజమైన దీక్షలు చేయాలి!" — ఎమ్మెల్సీ కవిత

తెలంగాణ (Telangana) జాగృతి (Jagruthi) వ్యవస్థాపన దినోత్సవం (Establishment Day) సందర్భంగా జరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీల హక్కుల కోసం ఢిల్లీకి వెళ్లి “ఉట్టి ఉట్టి ధర్నాలు” చేసే కాంగ్రెస్ నేతలను ఉద్దేశిస్తూ ఆమె తీవ్రంగా మండిపడ్డారు.

“కాంగ్రెస్ పార్టీ (Congress Party) నేతలు ఢిల్లీ (Delhi)లో దొంగ దీక్షలు కాదు… నిజమైన దీక్షలు చేయాలి. సామాజిక తెలంగాణ అంటే ఉప్పు నీరు లేని ధర్నాలు చేయడం కాదు,” అని విమర్శించారు.

బీసీల కోసం జాగృతి దీక్షకు సిద్ధం –
బీసీ హక్కుల (BC Rights) కోసం 72 గంటల దీక్షకు సిద్ధమయ్యామని, కానీ కోర్టు అనుమతి రాకపోవడం వల్ల ముందుకు సాగలేకపోయామని కవిత పేర్కొన్నారు. దీక్షలు శోభాయాత్రలకోసం కాదని, సమాజంలో వెనుకబడిన వర్గాల కోసం ఉండాలని స్పష్టం చేశారు.

“బీసీల కోసం ‘తెలంగాణ జాగృతి’ ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తోంది,” అని వెల్లడించారు.

జయశంకర్ జయంతి – జాగృతి వ్యవస్థాపన దినోత్సవం
ఈ సందర్భంగా జాగృతి కార్యాలయంలో జెండా ఆవిష్కరించిన కవిత, ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి నివాళులర్పించారు.

“జయశంకర్ (Jayashankar) సార్ భావాలను తూచ తప్పకుండా అనుసరించాం. ఆయన అడుగుజాడల్లోనే జాగృతి ముందుకు నడిచింది. ఆయన చెప్పినట్లుగా సామాజిక తెలంగాణ కోసం ప్రతి వర్గానికి న్యాయం జరగాలన్నదే మా లక్ష్యం,” అని పేర్కొన్నారు.

“బీసీల కోసం కాంగ్రెస్, బీజేపీకి చిత్తశుద్ధి లేదు”
కవిత మాట్లాడుతూ, బీసీల సమస్యలపై కాంగ్రెస్‌, బీజేపీలకు చిత్తశుద్ధి లేదని ధ్వజమెత్తారు. “ముస్లిం రిజర్వేషన్లను బీసీ కోటాలో కలపొద్దని బండి సంజయ్ తరచూ చెబుతుంటారు. బీజేపీ బీసీలను మోసం చేస్తోంది,” అని ఆరోపించారు.

కాంగ్రెస్‌పై విమర్శలు కొనసాగిస్తూ

“బీసీ రిజర్వేషన్ల అంశాన్ని అఖిలపక్షంగా ఢిల్లీకి తీసుకెళ్లాలి. అన్ని పార్టీల నేతలకు లేఖలు రాసి, రాష్ట్రపతిని కలవాలి,” అని డిమాండ్ చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment