బీఆర్‌ఎస్ పార్టీ (BRS Party) నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్సీ (MLC) కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) తన సొంత రాజకీయ పార్టీ (Own Political Party)ని ప్రారంభించడానికి సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. దసరా పండుగ రోజున, గాంధీ జయంతిని పురస్కరించుకుని ఆమె నూతన పార్టీని అధికారికంగా ప్రకటించవచ్చని ఊహాగానాలు తెలంగాణ వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. ఆమె కొత్త పార్టీకి ‘తెలంగాణ జాగృతి పార్టీ’ (Telangana Jagruthi Party) అని పేరు పెట్టే అవకాశాలు ఉన్నాయని కూడా వార్తలు వస్తున్నాయి.
బీఆర్‌ఎస్ నుంచి సస్పెండ్ అయినప్పటి నుంచి కవిత తన రాజకీయ కార్యకలాపాలను వేగవంతం చేశారు. కొత్త పార్టీ ఏర్పాటుపై సన్నిహితులు, మేధావులు, న్యాయవాదులతో చర్చించి, ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పార్టీ ప్రకటన తర్వాత త్వరలో జరగబోయే జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో అభ్యర్థిని పోటీకి దింపి, తాను భవిష్యత్తులో సిద్దిపేట నుంచి పోటీ చేయాలని కవిత భావిస్తున్నారని జాగృతి వర్గాలు చెబుతున్నాయి.







