కవిత రాజీనామాకు ఆమోదం

కవిత రాజీనామాకు ఆమోదం

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) చేసిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా (MLC Resignation) ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. బీఆర్‌ఎస్ పార్టీ (BRS Party) తనను సస్పెండ్ చేసిన నేపథ్యంలో, అదే పార్టీ తరపున గెలిచిన పదవిలో కొనసాగడం నైతికంగా సరైంది కాదని భావించి రాజీనామా చేస్తున్నట్లు కవిత స్పష్టం చేశారు. ఇప్పటికే గతేడాది సెప్టెంబర్‌లోనే శాసనమండలి చైర్మన్‌కు రాజీనామా లేఖ సమర్పించినట్లు వెల్లడించిన ఆమె, సోమవారం మండలిలో చేసిన ప్రసంగం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. భావోద్వేగంతో రాజీనామా చేయొద్దని చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Chairman Gutta Sukender Reddy) సూచించినప్పటికీ, తన నిర్ణయంపై వెనక్కి తగ్గేది లేదని కవిత తేల్చి చెప్పారు.

తాజాగా శాసనమండలి నిరవధిక వాయిదా పడడంతో కవిత రాజీనామాకు అధికారికంగా ఆమోదం లభించింది. వీడ్కోలు ప్రసంగం అనంతరం ఆమె తన భవిష్యత్ రాజకీయ ప్రణాళికను ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. బీఆర్‌ఎస్ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసిన కవిత, తన సొంత సంస్థ ‘తెలంగాణ జాగృతి’ని రాజకీయ వేదికగా మార్చి ప్రజల్లోకి వెళ్లనున్నట్లు వెల్లడించారు. 2028–29 ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని కొత్త రాజకీయ ప్రయాణానికి శ్రీకారం చుడుతున్నట్లు ఆమె ప్రకటించడంతో, తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు అవకాశం ఉందన్న చర్చ మొదలైంది.

Join WhatsApp

Join Now

Leave a Comment