‘డియ‌ర్ డాడీ’.. కేసీఆర్‌కు కవిత సంచ‌ల‌న లేఖ

'మై డియ‌ర్ డాడీ'.. కేసీఆర్‌కు కవిత సంచ‌ల‌న లేఖ

బీఆర్‌ఎస్‌ (BRS) అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ (KCR)కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) రాసిన లేఖ (Letter) ప్రస్తుతం తెలంగాణ (Telangana) రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపుతోంది. వరంగల్‌లో జరిగిన బీఆర్‌ఎస్ సిల్వర్ జూబ్లీ సభ (Silver Jubilee Meeting) అనంతరం, మే 2న కవిత రాసిన ఈ ఆరు పేజీల లేఖ ప్ర‌స్తుతం వెలుగులోకి వ‌చ్చింది. కాగా, బీఆర్ఎస్‌ పార్టీలోని పరిణామాలు, సభ విజయంపై స్పందనలు వంటి అనేక అంశాలను క‌విత లేఖ‌లో ప్ర‌స్తావించారు.

కవిత తన లేఖను “మై డియర్ డాడీ” (“My Dear Daddy”) అంటూ ప్రారంభించారు. ఆమె వరంగల్ (Warangal) సభ విజయంపై అభినందనలు తెలిపినప్పటికీ, పార్టీ నాయకత్వం గురించి ప‌లు అంశాల‌ను లేఖ‌లో ప్ర‌స్తావించారు క‌విత‌.

పాజిటివ్ అంశాలు:

  • బీఆర్‌ఎస్ సిల్వర్ జూబ్లీ విజయాన్ని కవిత హర్షించారు.
  • కేసీఆర్ ప్రసంగం క్యాడర్‌లో ఉత్సాహాన్ని నింపిందని పేర్కొన్నారు.
  • “ఆపరేషన్ కగార్” (“Operation Kagar”) పై చేసిన వ్యాఖ్యలు అందరికి నచ్చాయని తెలిపారు.
  • కాంగ్రెస్‌పై “ఫెయిల్ ఫెయిల్” అనే మాట ప్రజల్లో బాగా పాపులర్ అయిందన్నారు.
  • రేవంత్ రెడ్డి (Revanth Reddy) పై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయకపోవడం అందరినీ ఆకట్టుకుందన్నారు.
  • కేసీఆర్ పహల్గాం బాధితుల పట్ల మౌనం పాటించడాన్ని అభినందించారు.
  • తెలంగాణ అంటే కేసీఆర్ అనే మద్దతు ప్రజల్లో బలపడిందన్నారు.

నెగటివ్ అంశాలు:

  • ఉర్దూలో ప్రసంగించకపోవడం.
  • వక్ఫ్ బిల్లు (Wakf Bill) పై ప్రసంగించకపోవడం.
  • బీసీలకు 42% రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ వంటి కీలక విషయాలు గాలికి వదిలేయడం.
  • పాత ఇన్‌ఛార్జులకే బాధ్యతలు ఇవ్వడం వల్ల కొన్ని నియోజకవర్గాల్లో ఏర్పాట్లు బలహీనమయ్యాయని విమర్శ.
  • పంచాయతీ ఎన్నికల బి-ఫారాల విషయంలో కొత్త ఆశావహుల్లో అసంతృప్తి.
  • స్టేజ్‌కి రావాలనుకున్న కింది స్థాయి నాయకులకు అవకాశం లేకపోవడం.
  • ధూమ్ ధాం కార్యక్రమం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయిందని అభిప్రాయం.
  • బీజేపీపై ప్రసంగాన్ని హద్దుచేసిన కేసీఆర్ వల్ల బీజేపీతో పొత్తు ఊహాగానాలు వచ్చాయన్నారు.
  • ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం వల్ల బీఆర్‌ఎస్ బీజేపీకి సహకరిస్తోందన్న ప్రచారానికి అవకాశం దక్కిందని పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment