తెలంగాణ జాగృతి (Telangana Jagruti) అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత (Kavitha) భావోద్వేగానికి లోనయ్యారు. శాసనమండలి (Legislative Council)లో మాట్లాడుతూనే కన్నీళ్లు (Tears) పెట్టుకున్న కవిత.. కొన్నాళ్లకే తనపై రాజకీయ కక్ష మొదలైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎనిమిదేళ్లపాటు స్వతంత్రంగా ‘జాగృతి’ సంస్థ (‘Jagruti’ Organisation)ను నడిపానని, ఆ సంస్థను అడ్డుకునేందుకు మొదటి రోజు నుంచే ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు.
తన దగ్గరకు పెద్దవాళ్లు, పైరవీలు చేసే వారు ఎప్పుడూ రాలేదని, నేను పేదల కోసమే పనిచేశానని తెలిపారు. తనకి పార్టీ, పత్రికలు, ఛానళ్లు తనకు మద్దతు ఇవ్వలేదని, పార్టీ అంతర్గత సమావేశాల్లో నేను ప్రశ్నలు వేస్తే తనపై కక్షగట్టారని కవిత వాపోయారు. రాజకీయ కక్షలతోనే తనను జైలుకు పంపించారని, ఆ సమయంలో కూడా పార్టీ నుంచి తనకి అండ దక్కలేదని పేర్కొన్నారు.
బీఆర్ఎస్లో డిసిప్లినరీ కమిటీ (BRS Disciplinary Committee) అనేది పెద్ద జోక్‌లా మారిందని కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన అభిప్రాయం తెలుసుకోకుండా సస్పెండ్ చేశారని, ఇది ఆస్తుల పంచాయితి కాదని.. ఆత్మగౌరవ పంచాయితి అని స్పష్టం చేశారు. రాజకీయాల్లో మహిళలకు సమాన హక్కులు రావాలని, ఉద్యమకారులను, పార్టీకి మద్దతు ఇచ్చిన వారిని గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇదిలా ఉండగా, కవిత రాజీనామాపై మరోసారి ఆలోచించాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutta Sukhender Reddy) సూచించారు. కవిత ఆవేదనను అర్థం చేసుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు.








