గ్రూప్-1 ఉద్యోగాలు రద్దు చేసి.. రీ-ఎగ్జామ్ పెట్టాలి – కవిత

గ్రూప్-1 ఉద్యోగాలు రద్దు చేసి… మళ్లీ రీ-ఎగ్జామ్ పెట్టాలి: కవిత డిమాండ్

గ్రూప్-1 నియామకాల విషయంలో నోటిఫికేషన్ నాటి నుంచి ఫలితాల వరకు అడుగడుగునా తప్పులు జరిగాయని జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. ఈ లోపాలను తాను మండలిలో కూడా ఎత్తి చూపినప్పటికీ, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఈ తప్పులను గట్టిగా ప్రశ్నించాల్సిన అవసరం ఉందని ఆమె సూచించారు.

సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన రౌండ్‌ టేబుల్ సమావేశం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ నెల 15 వరకు వివిధ కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు. “నిన్న విద్యార్థి అమరవీరులకు నివాళులు అర్పించి, వారి సాక్షిగా పోరాటం ప్రారంభించాం” అని ఆమె స్పష్టం చేశారు. ప్రభుత్వం చేసిన తప్పులను ఎత్తిచూపడానికే ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశామన్నారు.

మీడియా సహకారం, డిమాండ్లు
ప్రభుత్వం చేసిన తప్పులను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మీడియా, సోషల్ మీడియా చాలా సహకరిస్తున్నాయని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. వారి ఒత్తిడి కారణంగానైనా ప్రభుత్వం కొంచెమైనా బుద్ధి తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం ఇచ్చిన ఉద్యోగాలను రద్దు చేసి… రీ-ఎగ్జామ్ కండక్ట్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

రౌండ్ టేబుల్ సమావేశంలో చేసిన తీర్మానాన్ని గవర్నర్‌కు, ముఖ్యమంత్రికి పంపిద్దామన్నారు. తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని స్పష్టం చేసిన కవిత, విద్యార్థులకు జాగృతి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

Join WhatsApp

Join Now

Leave a Comment