కేటీఆర్ కు మద్దతుగా కవిత… ప్రభుత్వంపై విమర్శలు

కేటీఆర్ కు మద్దతుగా కవిత...ప్రభుత్వంపై విమర్శలు

బీఆర్‌ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఏసీబీ విచారణకు (ACB Inquiry) హాజరైన నేపథ్యంలో, ఎమ్మెల్సీ (MLC) కవిత (Kavitha) ఆయనకు మద్దతు (Support)గా నిలిచారు. ఫార్ములా-ఈ కార్ (Formula-E Car) రేసింగ్ (Racing) కేసు (Case)లో ఏసీబీ విచారణ కొనసాగుతున్న సందర్భంగా, కవిత మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. “ఏ పార్టీలోనైనా లోపాలు ఉన్నప్పుడు అధినేతకు చెప్పుకోవడం సహజం. చెప్పుకున్నంత మాత్రానా దాన్నేదో భూతద్దంలో చూపించాల్సిన అవసరం లేదు. మా పార్టీలో లోపాలు సవరించుకుంటాం. మా మీద ఎవరైనా దాడి చేస్తే ఊరుకోం. ప్రధాన సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకే ఏసీబీ విచారణలు అంటూ హడావిడి. మా కార్యకర్తలను, నేతలను ఇళ్లకు రాకుండా అడ్డుకోవడం దారుణం” అని అన్నారు.

ప్రభుత్వంపై కవిత విమర్శలు
కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా (Farmer Support Scheme)ను ఒకసారి మాత్రమే ఇచ్చిందని, అది కూడా 60 శాతం మంది రైతులకే ఇచ్చిందని కవిత ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రైతులకు, ప్రజలకు ఎన్నో హామీలిచ్చి అందరినీ మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, రైతు భరోసా సహా అన్ని హామీలను నెరవేర్చకుండా ప్రభుత్వం మోసం చేసిందని తీవ్రంగా విమర్శించారు.

“పింఛన్లు పెంచలేదు.. మహిళలకు రూ.2,500 ఇవ్వలేదు.. ఇలా అన్ని హామీలను కాంగ్రెస్ ఎగవేసింది. హామీల అమలుపై, సర్కారు చేస్తోన్న అక్రమాలపై ప్రశ్నిస్తున్నామని మా పార్టీ అధినేత కేసీఆర్ (KCR), వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR), హరీశ్ రావు (Harish Rao)లకు నోటీసులు(Notice) ఇచ్చి ఈ ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తోంది” అని కవిత ఆరోపించారు.

“మేం వేధింపులకు భయపడే వాళ్ళం కాదు”
“మొన్ననే కాళేశ్వరం కమిషన్ పేరుతో కేసీఆర్‌ను విచారించింది. ఇప్పుడు కేటీఆర్‌ను ఏసీబీ విచారిస్తోంది. మేం వేధింపులకు భయపడే వాళ్ళం కాదు.. కేటీఆర్ విచారణకు హాజరయ్యారు. కేటీఆర్ విచారణ సందర్భంగా ఈ ప్రభుత్వం తెలంగాణ భవన్ తాళం వేయడం దుర్మార్గం. మా కార్యకర్తలు, నాయకులను బయటికి రానివ్వకుండా అడ్డుకోవడం దారుణం. మా పార్టీ లోపాలను సవరించుకుంటాం.. మా మీద ఎవరైనా దాడికి వస్తే కలిసికట్టుగా ఎదుర్కొంటాం” అని కవిత స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment