తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అరెస్ట్

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అరెస్ట్

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ కామారెడ్డిలో రైలు రోకో కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసనలో ఆమెతో పాటు తెలంగాణ జాగృతి నాయకులు రైలు పట్టాలపై బైఠాయించి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రంగంలోకి దిగిన పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది కవితను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ పెనుగులాటలో కవితకు స్వల్ప గాయాలైనట్లు సమాచారం. 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు కేవలం 17 శాతం రిజర్వేషన్లతోనే పంచాయతీ ఎన్నికలకు వెళ్లడం దారుణమని కవిత విమర్శించారు.

రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అమలు కాకుండా కాంగ్రెస్, బీజేపీలు కుట్రలు చేస్తున్నాయని కవిత ఈ సందర్భంగా ఆరోపించారు. ట్రాక్‌పై నిరసన తెలుపుతున్న జాగృతి నేతలను పోలీసులు అక్కడి నుంచి తప్పించే ప్రయత్నం చేయడంతో కామారెడ్డిలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీసీ రిజర్వేషన్ల పెంపు ప్రధాన డిమాండ్‌గా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చేపట్టిన ఈ రైల్‌రోకో కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ చర్చకు దారితీసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment