---Advertisement---

పాడి కౌశిక్ రెడ్డికి హైకోర్టులో ఊరట..

పాడి కౌశిక్ రెడ్డికి హైకోర్టులో ఊరట..
---Advertisement---

బీఆర్ఎస్ ఎమ్మెల్యే (BRS MLA) పాడి కౌశిక్‌రెడ్డికి (Padi Kaushik Reddy) తెలంగాణ హైకోర్టు (Telangana High Court) బిగ్ రిలీఫ్ ఇచ్చింది. సుబేదారి పీఎస్‌లో నమోదైన కేసు (Case)లో సోమవారం వరకు కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు ఆదేశించింది. అరెస్టు చేయ‌కుండా దర్యాప్తు కొనసాగించొచ్చని, పోలీసులకు సహకరించాలని కౌశిక్ రెడ్డికి సూచించింది కోర్టు.

కమలాపూరం మండలం వంగపల్లి (Vangapalli )లో క్వారీ (Quarry) యజమాని మనోజ్‌ (Manoj)ను 50లక్షల ఇవ్వాలంటూ బెదిరించాడని కౌశిక్‌పై మనోజ్ భార్య ఉమాదేవి (Uma Devi) ఫిర్యాదు మేరకు సుబేదారి పీఎస్‌లో కేసు నమోదు అయ్యింది. కాగా, త‌న‌పై న‌మోదైన కేసును కొట్టేయాలంటూ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. రాజకీయ కక్ష్యల కారణంగానే కేసు నమోదు చేశారని కౌశిక్ రెడ్డి న్యాయవాది కోర్టులో వాదించారు. 27న ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు ఉన్నాయని, ఆ వేడుకకు దూరం చేయ‌డానికే త‌ప్పుడు ఆరోప‌ణ‌ల‌తో కేసు పెట్టార‌ని కోర్టుకు తెలిపారు. కౌశిక్‌ రెడ్డిని తదుపరి విచారణ వరకు అరెస్ట్ చేయొద్దని ఆదేశిస్తూ 28వ తేదీకి విచారణ వాయిదా వేసింది హైకోర్టు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment