ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మద్యం కేసు (Liquor Case)లో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి (Kasireddy Rajasekhar Reddy) మరో సంచలన ఆడియో (Audio) విడుదల చేశారు. రేపు తాను సిట్ (SIT) విచారణకు (Inquiry) హాజరుకాబోతున్నట్లుగా ఆడియో ద్వారా ప్రకటించారు. ఈ మేరకు ఆయన సిట్‌కు సమాచారం (Information) ఇచ్చారు. ఇప్పటికే మద్యం కేసులో కసిరెడ్డి రాజశేఖర్‌కి నాలుగుసార్లు నోటీసులు ఇచ్చిన సిట్.. ఈరోజు మరోసారి కసిరెడ్డి తండ్రి ఉపేందర్‌రెడ్డికి నోటీసులు అందించింది.
తన కుమారుడి తరఫున ఉపేందర్‌రెడ్డి (Upender Reddy) ఇప్పటికే రెండుసార్లు విచారణకు హాజరయ్యారు. కాగా, ఇవాళ మళ్లీ నోటీసులు అందించడంతో రాజ్ కసిరెడ్డి మరో ఆడియోను విడుదల చేశారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకల్లా సిట్ ఆఫీస్ (SIT Office) కు వస్తానని ప్రకటించారు. సిట్ అధికారులకు తన తండ్రి సమాచారం ఇచ్చారని చెప్పారు. ముందస్తు బెయిల్‌పై హైకోర్టులో వాదనలకు సమయం పట్టేలా ఉందని, అందుకే రేపు సిట్ విచారణకు తాను హాజరవుతున్నట్లుగా ప్రకటించారు.
మద్యం కేసులో ముందస్తు బెయిల్ (Anticipatory Bail) కోసం కసిరెడ్డి రాజ్ కోర్టు (Court) ను ఆశ్రయించారు. ముందస్తుబెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా వేసిన కోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీ (CID) కి ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణ వచ్చేవారానికి వాయిదా వేసింది. విచారణకు హాజరు కావాలని సిట్ అధికారుల నుంచి తీవ్రమైన ఒత్తిడి రావడంతో ఎట్టకేలకు విచారణ హాజరవుతానని ఆడియో సందేశం ద్వారా కసిరెడ్డి రాజ్ ప్రకటించారు.
ఓట్లు కొనేందుకు కాంగ్రెస్ ‘హైడ్రా’: కేటీఆర్