కరూర్ తొక్కిసలాట.. టీవీకే నేత‌ల‌పై కేసు నమోదు

కరూర్ తొక్కిసలాట.. టీవీకే నేత‌ల‌పై కేసు నమోదు

తమిళనాడు (Tamil Nadu) కరూర్‌ (Karur)లో టీవీకే ర్యాలీ (TVK Rally) సందర్భంగా జరిగిన తొక్కిసలాట (Stampede) ఘటనపై పోలీసులు కేసు(Case) నమోదు చేశారు. ఈ విషాద ఘటనలో 40 మంది మృతిచెందగా, పలువురు గాయపడ్డ సంగతి తెలిసిందే. తాజాగా కరూర్ నగర పోలీస్ స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పోలీసులు ఇచ్చిన వివరాల ప్రకారం, టీవీకే పార్టీకి చెందిన‌ పుస్సీ ఆనంద్ (Pussy Anand), సి.టి. నిర్మల్ కుమార్ (C.T. Nirmal Kumar) సహా నలుగురిపై కేసు నమోదు చేశారు.

A1గా మతియజగన్ (Mathiyazhagan) – కరూర్ వెస్ట్ జిల్లా కార్యదర్శి, A2గా పుస్సీ ఆనంద్, A3గా నిర్మల్ కుమార్ మరియు ఇతరులు ఉన్నారు. ఈ కేసు BNS సెక్షన్లు 105, 110, 125(b), 223 r/w 3 of TNPPDL Act కింద నమోదు చేశారు. ఈ ఘటనపై ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం దర్యాప్తు ఆదేశించగా, కరూర్ పోలీసులు కీలకమైన చర్యలు ప్రారంభించారు. మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment