బాలీవుడ్ హీరోతో శ్రీలీల డేటింగ్? హింట్ వ‌చ్చేసింది!

బాలీవుడ్ హీరోతో శ్రీలీల డేటింగ్? హింట్ వ‌చ్చేసింది!

బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్(Kartik Aaryan) మరియు టాలీవుడ్ బ్యూటీ శ్రీలీల(Sreeleela) డేటింగ్‌(Dating)లో ఉన్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా, కార్తీక్ తల్లి చేసిన వ్యాఖ్యలు ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చాయి.

కార్తీక్ తల్లి మాట్లాడుతూ త‌మకు వైద్యురాలే కోడలుగా రావాల‌ని కోరిక ఉంద‌ని అని చెప్పడం ఆస‌క్తిక‌రంగా మారింది. కార్తీక్ త‌ల్లి ఆన్స‌ర్‌ నెటిజన్ల ఊహాగానాల‌కు హింట్ ఇచ్చిన‌ట్లుగా అయ్యింది. ఎందుకంటే, శ్రీలీల మెడిసిన్ చదువుతోంది అనే విషయం అందరికీ తెలిసిందే. దీంతో “ఇది పరోక్షంగా వారి డేటింగ్‌పై క్లారిటీ ఇచ్చినట్టే” అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

అయితే, ఇప్పటి వరకు కార్తీక్ ఆర్యన్ లేదా శ్రీలీల ఈ వ్యవహారంపై ఏమీ మాట్లాడలేదు. వీరి మధ్య నిజంగానే ఏదైనా ఉందా? లేక ఇవన్నీ కేవలం పుకార్లేనా? అనేది తెలియాల్సి ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment