కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ(Karthi) తన తాజా చిత్రం సర్దార్-2(Sardar 2) షూటింగ్లో గాయపడ్డారు(Shooting Injury). మైసూరులో కీలక యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుండగా, ఆయన కాలికి గాయమైంది. వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించిన చిత్రబృందం, వైద్యుల సూచన మేరకు కార్తీకి వారంపాటు విశ్రాంతి అవసరమని తెలియజేశారు.
దీంతో షూటింగ్ తాత్కాలికంగా నిలిచిపోయింది. ప్రస్తుతం కార్తీ చెన్నై వెళ్లిపోయారు. పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కార్తీ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారు. అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.