కర్ణాటక (Karnataka) లో శనివారం తెల్లవారుజామున కలబురగి (Kalaburagi) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. జెవర్గి తాలూకాలోని నెలోగి సమీపంలో ఆగి ఉన్న లారీని మినీ ట్రావెల్ బస్సు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు (Five people) అక్కడికక్కడే మరణించారు (Died). మరణించిన వారిని వాజిద్, మెహబూబి, ప్రియాంక, మెహబూబుగా గుర్తించారు. వీరంతా బాగల్కోట్కు చెందినవారని సమాచారం.
ఈ ప్రమాదంలో మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు (Injured). వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం సమయంలో బస్సు యాత్రికులతో నిండిగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.