శాసనసభ స్పీకర్ కుర్చీని అగౌరవ పరిచారన్న కారణంతో 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటుపడింది. ఆరు నెలల పాటు సభ నుంచి సస్పెండ్ చేస్తూ కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ ప్రకటించారు. శాసన సభా కార్యక్రమాలను అడ్డుకున్నందుకు సస్పెండ్ చేసినట్లు స్పీకర్ యూటీ ఖాడ్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఎవరు సస్పెండ్ అయిన బీజేపీ ఎమ్మెల్యేలు వీరే..
దొడ్డన్న గౌడ పాటిల్, సీకే రామమూర్తి, అశ్వత్థ నారాయణ, ఎస్ఆర్ విశ్వనాథ్, బైరతి బసవరాజు, MR పాటిల్, చన్నబసప్ప, బి. సురేష్ గౌడ, ఉమానాథ్ కోట్యాన్, శరణు సల్‌గర్, శైలేంద్ర బెల్డేల్, యశ్‌పాల్ సువర్ణ, హరీష్ బీపీ, డా. భరత్ శెట్టి, మునిరత్న, బసవరాజు మట్టిమోడ్, ధీరజ్ మునిరాజు, డాక్టర్ చంద్రు లమాని ఉన్నారు.