---Advertisement---

సైఫ్‌పై దాడి కేసు.. కరీనా కపూర్ వాంగ్మూలం రికార్డ్‌

సైఫ్‌పై దాడి కేసు.. కరీనా కపూర్ వాంగ్మూలం రికార్డ్‌
---Advertisement---

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై జరిగిన క‌త్తి దాడి కేసు బాలీవుడ్‌లో పెద్ద దుమారం రేపింది. ఈ కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేస్తూ, దాడి ఘటనపై సైఫ్ భార్య, ప్రముఖ నటి కరీనా కపూర్ నుంచి వాగ్మూలం నమోదు చేశారు. విచారణలో కరీనా కపూర్ వెల్లడించిన వివరాలు ఈ కేసు పరిణామాలకు కీలకమయ్యాయి. సైఫ్‌పై దుండగుడు పలు మార్లు దాడి చేసినట్లు కరీనా పేర్కొన్నారు. అయితే, ఈ దాడిలో వారి ఇంట్లో నుంచి ఎటువంటి వస్తువులు దొంగతనం కాలేదని స్పష్టం చేశారు.

కేసు క్లూజ్ అవుతుందా?
ఈ విచారణలో కొత్త వివరాలు వెలుగు చూస్తున్నాయి. దాడి చేసిన వ్యక్తి ఉద్దేశ్యం దొంగతనం కాదా? లేక ఇతర వ్యక్తిగత కారణాలా అన్నది పోలీసులు పరిశీలిస్తున్నారు. కాగా, దొంగ చేతిలో తీవ్రంగా గాయ‌ప‌డిన సైఫ్ అలీఖాన్ ప్ర‌స్తుతం లీలావ‌తి ఆస్ప‌త్రిలో కోలుకుంటున్నారు. ఆయ‌న‌కు శ‌స్త్ర చికిత్స‌లు చేసిన వైద్యులు ప్ర‌స్తుతం సైఫ్ ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉంద‌ని స్ప‌ష్టం చేశారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment