రిషబ్ శెట్టి (Rishab Shetty) హీరోగా నటించిన ‘కాంతార’ (Kantara) సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కన్నడలో తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం సంచలన విజయం సాధించగా, తెలుగులోనూ మంచి కలెక్షన్లు రాబట్టింది. ఇప్పుడు ఈ సూపర్ హిట్ సినిమాకు ప్రీక్వెల్‌గా ‘కాంతార: చాప్టర్ 1’ తెరకెక్కుతోంది.
రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా దేశవ్యాప్తంగా అంచనాలను పెంచింది. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అభిమానుల ఎదురుచూపులకు తెరదించుతూ, రిషబ్ శెట్టి సోషల్ మీడియా ద్వారా ‘కాంతార: చాప్టర్ 1’ (Kantara: Chapter 1) విడుదల తేదీని ప్రకటించి శుభవార్త అందించారు. ఈ చిత్రం అక్టోబర్ 2, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
‘హోంబలే ఫిల్మ్స్’ (Hombale Films) బ్యానర్ Banner)పై నిర్మాత విజయ్ కిరగందూర్ (Vijay Kiragandur) ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో, అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం హాలీవుడ్ స్టంట్ టెక్నీషియన్లు కూడా పనిచేస్తుండటం విశేషం.
‘కాంతార: చాప్టర్ 1’ భారీ బడ్జెట్‌తో సిద్ధమవుతుండటంతో, షూటింగ్‌తో పాటు ప్రీ-ప్రొడక్షన్ పనులకు కూడా చాలా సమయం పడుతోంది. అంతేకాకుండా, ‘కాంతార’ టీమ్‌ను వరుస ప్రమాదాలు వెంటాడటంతో షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది. అన్ని అవాంతరాలను అధిగమించి, ఈ ఏడాది అక్టోబర్ 2న చిత్రాన్ని విడుదల చేయాలని రిషబ్ శెట్టి, చిత్ర బృందం నిర్ణయించింది.








