బాలీవుడ్ నటి (Bollywood Actress), లోక్‌సభ ఎంపీ (Lok Sabha MP) కంగనా రనౌత్ (Kangana Ranaut) రాజకీయ జీవితంపై (Political Life) సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు సేవ చేయాలనే ఆశయంతో రాజకీయాల్లోకి రాలేదని, తన జీవితంలో సామాజిక సేవకు చోటు లేదని ఆమె స్పష్టం చేశారు.
“రాజకీయ జీవితాన్ని నేను ఆస్వాదించడం లేదు. ఇది సామాజిక సేవలా అనిపిస్తోంది. నేను మహిళల హక్కుల కోసం పోరాడాను కానీ ప్రజలకు సేవ చేయాలని ఎన్నడూ అనుకోలేదు” అని కంగనా తెలిపారు. పంచాయతీ స్థాయి సమస్యలను కూడా ప్రజలు తన వద్దకు తీసుకువస్తున్నారని, రోడ్ల మరమ్మత్తుల కోసం తన డబ్బులు ఖర్చు చేయమని డిమాండ్ చేస్తున్నారని ఆమె అసహనం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో రాజకీయాల్లో కొనసాగాలని తాను అనుకోవడం లేదని కంగనా తేల్చి చెప్పారు.
తన జీవితంలో పెద్ద ఇల్లు, మంచి కారు, వజ్రాల ఆభరణాలు మాత్రమే కోరుకున్నానని, తాను సెల్ఫిష్‌గా బతికానని కంగనా నిజాయితీగా వెల్లడించారు. తన జీవితాన్ని ప్రజల కోసం త్యాగం చేయలేనని, పూర్తిగా సామాజిక సేవకు అంకితం చేసే జీవితం తనకు ఇష్టం లేదని ఆమె స్పష్టం చేశారు.
కంగనా రనౌత్ 2024 లోక్‌సభ (Lok Sabha) ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)లోని మండి నియోజకవర్గం (Mandi Constituency) నుంచి ఎంపీగా గెలుపొందారు. ఆమె చివరిగా ‘ఎమర్జెన్సీ’ (Emergency) చిత్రంలో ఇందిరా గాంధీ (Indira Gandhi) పాత్రలో నటించారు.