ప‌నికిమాలిన అవార్డులు.. – కంగ‌నా కాంట్ర‌వ‌ర్సీ కామెంట్స్‌

ప‌నికిమాలిన అవార్డులు.. - కంగ‌నా కాంట్ర‌వ‌ర్సీ కామెంట్స్‌

బాలీవుడ్ బ్యూటీ (Bollywood Beauty), తన బోల్డ్ వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) మరోసారి సంచలనంగా మారారు. తన నటనపై అభిమానుల ప్రేమే నిజమైన అవార్డని చెబుతూ, ఫిలిం అవార్డులపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కంగ‌నా ప్రధాన పాత్రలో నటించిన ఎమర్జెన్సీ (Emergency) చిత్రం ఓ అభిమానిని కదిలించింది. దీంతో అత‌ను కంగ‌నాకు చీరను బహుమతి (Gift) గా పంపాడు. ఈ విషయాన్ని స్వయంగా కంగనా తన సోషల్ మీడియాలో వెల్లడిస్తూ, “పనికిమాలిన (Useless) అవార్డుల‌కంటే (Awards) ఈ చీర (Saree) ఎంతో విలువైనది (More Valuable)” అని వ్యాఖ్యానించారు. కంగనా వ్యాఖ్యలు బాలీవుడ్‌లో అవార్డుల ఎంపిక అంశంపై మరోసారి చర్చకు దారితీశాయి. అభిమాని ప్రేమను నిజమైన గుర్తింపుగా చూడడమే తనకు ముఖ్యమని ఆమె స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment