దుర్గమ్మ ప్రసాదంలో వెంట్రుకలు.. భ‌క్తుల ఆగ్ర‌హం

దుర్గమ్మ ప్రసాదంలో వెంట్రుకలు.. భ‌క్తుల ఆగ్ర‌హం

ఆంధ్రప్రదేశ్‌లోని ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్రాల్లో ఒక‌టైన‌ విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో భ‌క్తుల‌కు ఎదురైన ఘ‌ట‌న ఒక‌టి ఆగ్ర‌హానికి గురిచేసింది. క‌న‌క దుర్గ అమ్మవారి ప్ర‌సాదంపై భ‌క్తుల్లో విప‌రీత‌మైన న‌మ్మ‌కం ఉంది. భ‌క్తులు ప‌ర‌మ ప‌విత్రంగా భావించే అమ్మ‌వారి ప్ర‌సాదం త‌యారీలో అప‌చారం చోటుచేసుకుంది. ల‌డ్డూ ప్రసాదంలో వెంట్రుకలు కనిపించడం భక్తులను షాక్‌కు గురిచేసింది.

ఒక భక్తుడు ఈ దృశ్యాలను ఫొటోలు తీసి సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి స్పందిస్తూ.. భక్తుడికి క్షమాపణ చెప్పారు. అలాగే, ఇలాంటి తప్పిదాలు మరోసారి జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికీ, ఆలయ అధికారుల నిర్లక్ష్యంపై భక్తులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment