---Advertisement---

కళ్యాణ్ రామ్ ‘అర్జున్ S/O వైజయంతి’ టీజర్ వచ్చేసింది

కళ్యాణ్ రామ్ ‘అర్జున్ S/O వైజయంతి’ టీజర్ వచ్చేసింది
---Advertisement---

నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram) ప్రధాన పాత్రలో, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి(Vijayashanti) కీలక పాత్రలో నటిస్తున్న ‘అర్జున్ S/O వైజయంతి’(Arjun S/O Vaijayanti) మూవీ టీజర్(Movie Teaser) విడుదలైంది. ఈ సినిమా తల్లి-కొడుకుల సెంటిమెంట్, ఇంటెన్స్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామాగా కనిపిస్తోంది. ఈ చిత్రానికి ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తుండగా, సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. అజనీష్ లోక్‌‌‌‌నాథ్ సంగీతం అందిస్తున్నాడు.

ఇవాళ రిలీజ్ అయిన టీజ‌ర్ సినిమాపై భారీ అంచ‌నాల‌ను పెంచేసింది. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ నంద‌మూరి ఫ్యాన్స్‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంటుంది. విజ‌య‌శాంతితో పాటు ఈ సినిమాలో ఫృథ్వీ, శ్రీ‌కాంత్ కీల‌క పాత్ర‌లు పోషించిన‌ట్లుగా టీజ‌ర్ ద్వారా అర్థం అవుతుంది. ప్రేక్షకుల నుంచి టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా వేసవి సెలవుల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment