‘జాగృతి జనం బాట’లో ఫ్లెక్సీల వివాదం.. కవిత ఆగ్రహం

'జాగృతి జనం బాట'లో ఫ్లెక్సీల వివాదం.. కవిత ఆగ్రహం

‘జాగృతి జనం బాట’ (Jagruti Janam Baata) కార్యక్రమంలో భాగంగా నల్లగొండ జిల్లాలో పర్యటించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Telangana Jagruti President Kalvakuntla Kavitha), తన ఫ్లెక్సీలను (Flex Banners) మున్సిపల్ సిబ్బంది తొలగించడంపై తీవ్రంగా స్పందించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy Venkat Reddy)ని పరోక్షంగా విమర్శిస్తూ, ప్రజా సమస్యలను ప్రస్తావిస్తే ఫ్లెక్సీలు తొలగిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజా సమస్యలను తాను లేవనెత్తుతున్నానని, చేతనైతే వాటిని ప్రభుత్వం త్వరగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్‌(BRS)ను విమర్శించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే నిర్లక్ష్యాన్ని కొనసాగిస్తోందని కవిత మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఆదేశాలను కూడా కలెక్టర్‌లు పట్టించుకోవడం లేదని ఆమె పేర్కొన్నారు. నల్లగొండ జిల్లాలో ముఖ్యంగా కృష్ణా జలాల సమస్యపై ఆమె ప్రభుత్వాన్ని నిలదీశారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు రెండూ జిల్లాకు సాగునీరు అందించడంలో విఫలమయ్యాయని ఆరోపించారు.

సుంకిశాల లిఫ్ట్ ఇరిగేషన్ కాంట్రాక్టర్‌పై, ఎస్ఎల్‌బీసీ ఘటనపై (SLBC Incident) విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నాగార్జున సాగర్ ఎడమ కాలువను ప్రభుత్వం తమ అధీనంలోకి తీసుకోవాలని, లేకపోతే కృష్ణా జలాల కోసం భూ నిర్వాసితులతో కలిసి ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడిస్తామని కవిత హెచ్చరించారు. అంతేకాక, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎపిడ్యూరల్ మెడిసిన్ అందుబాటులో ఉంచాలని, భూదాన్ భూములను స్వాధీనం చేసుకోవాలని, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను ఎప్పుడు అందుబాటులోకి తెస్తారో సీఎం స్పష్టం చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment