పాన్ ఇండియా సూపర్ హిట్ మూవీ ‘కల్కి (‘Kalki) 2898 AD’ తో అశేష ప్రేక్షకాదరణ పొందిన దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin), ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ ‘కల్కి (‘Kalki) 2’ గురించి సంచలన విషయాలు వెల్లడించారు. ప్రభాస్ (Prabhas) ప్రధాన పాత్రలో నటించిన ఈ సై-ఫై థ్రిల్లర్ ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఈ అద్భుతమైన విజయంతో, అభిమానులందరి దృష్టి సీక్వెల్‌పై పడింది.
తాజాగా ఒక పోడ్‌కాస్ట్‌లో పాల్గొన్న నాగ్ అశ్విన్ మాట్లాడుతూ, ‘కల్కి 2’ షూటింగ్ 2025 చివరిలో ప్రారంభించాలని భావిస్తున్నట్లు తెలిపారు. అయితే, సినిమాలోని నటీనటులందరి షెడ్యూల్స్ కుదరడంపై ఇది ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు. అలాగే, ఈ సినిమాలోని భారీ యాక్షన్ సన్నివేశాలు చాలా పెద్దవిగా ఉంటాయని, వాటి కోసం ఎక్కువ సమయం పడుతుందని చెప్పారు. ప్రస్తుతానికి ఖచ్చితమైన సమాధానం చెప్పలేనని, తారలంతా బిజీగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
అంతేకాకుండా, షూటింగ్ కంటే పోస్ట్-ప్రొడక్షన్ పనులకే ఎక్కువ సమయం పడుతుందని నాగ్ అశ్విన్ స్పష్టం చేశారు. ఈ సినిమా పూర్తి కావడానికి మరో 2 లేదా 3 సంవత్సరాలు పట్టవచ్చని ఆయన అంచనా వేశారు. ఈ ప్రకటన ప్రభాస్ అభిమానులకు కాస్త నిరాశ కలిగించింది. ‘కల్కి 2’ కోసం అభిమానులు ఓపిక పట్టాలని నాగ్ అశ్విన్ కోరారు. ‘కల్కి 2898 AD’లో ప్రభాస్‌తో పాటు దీపికా పదుకోణ్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి ప్రముఖ తారలు నటించిన విషయం తెలిసిందే.








