కాకినాడకు గ్రేట్ డేంజర్ సిగ్నల్‌.. 10 నంబ‌ర్ ప్ర‌మాద హెచ్చ‌రిక‌

కాకినాడకు గ్రేట్ డేంజర్ సిగ్నల్‌.. 10 నంబ‌ర్ ప్ర‌మాద హెచ్చ‌రిక‌

మొంథా (Montha) తుపాన్ (Cyclone) ప్రభావంతో తూర్పు గోదావరి, కోనసీమ జిల్లాలు అలజడి సృష్టిస్తున్నాయి. కాకినాడ తీరానికి సమీపిస్తున్న తుఫాను కారణంగా వాతావరణం మరింత వేగంగా మారిపోతోంది. తుపాను ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు అత్యవసర చర్యలు చేపట్టారు.

కాకినాడ పోర్టు (Kakinada Port) అధికారుల ప్రకటన ప్రకారం, 10వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అలాగే విశాఖ, గంగవరం, భీమునిపట్నం, కళింగపట్నం ఓడరేవుల్లో 9వ నెంబర్ డేంజర్ సిగ్నల్, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం ఓడరేవులకు 8వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యాయి.

తీరప్రాంత గ్రామాలపై భారీ అలలు విరుచుకుపడుతున్నాయి. సముద్రం ఉధృతంగా మారడంతో, తీరప్రాంత ప్రజల భద్రత కోసం జిల్లా యంత్రాంగం పెద్ద ఎత్తున చర్యలు చేపట్టింది. కోనసీమ జిల్లాలోని 11 మండలాలు తీవ్ర తుఫాను ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాయి.

కాట్రేనికోన (Katrenikona) మండలంలో పరిస్థితి అత్యంత క్లిష్టంగా మారడంతో అధికారులు ప్రజలను బోట్ల సాయంతో పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇప్పటివరకు 1200 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు జిల్లా అధికారులు వెల్లడించారు. తుఫాను కారణంగా అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడింది. విద్యుత్ శాఖ సిబ్బంది అత్యవసర బృందాలతో మరమ్మతు పనుల్లో నిమగ్నమయ్యారు.

ప్రస్తుతం కాకినాడ, కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి తీరప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సముద్రం ఉధృతిని దృష్టిలో ఉంచుకుని, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదని అధికారులు మరోసారి హెచ్చరిక జారీ చేశారు. ప్రభుత్వం, విపత్తు నిర్వహణ సంస్థలు, జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, ప్రజలను సురక్షితంగా ఉంచేందుకు అన్ని చర్యలు చేపడుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment