---Advertisement---

‘కన్నప్ప’లో కాజ‌ల్ అగ‌ర్వాల్ ఫ‌స్ట్ లుక్ రివీల్‌

‘కన్నప్ప’లో కాజ‌ల్ అగ‌ర్వాల్ ఫ‌స్ట్ లుక్ రివీల్‌
---Advertisement---

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘కన్నప్ప’. ఈ చిత్రం పాన్ ఇండియా లెవ‌ల్‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్, టాలీవుడ్ నుంచి ప్రభాస్, మోహన్ లాల్, మోహన్ బాబు, బ్రహ్మానందం వంటి తారలు ప్ర‌ధాన పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. ఈ సినిమాతో మంచు విష్ణు కుమారుడు కూడా తెరంగ్రేటం చేయ‌బోతున్నాడు.

కాజల్ అగర్వాల్ ఫస్ట్ లుక్ విడుదల
తాజాగా, ఈ చిత్రంలో పార్వతి దేవి పాత్రలో నటిస్తున్న కాజల్ అగర్వాల్ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. నాలుగు భాషల్లో విడుదలైన ఈ పోస్టర్‌లో కాజల్ శక్తివంతమైన లుక్‌లో కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది.

క‌న్న‌ప్ప టీజర్‌కు స్పందన
ఇప్పటికే విడుదలైన ‘కన్నప్ప’ టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. యాక్షన్ సీన్లు, యుద్ధ సన్నివేశాలు, హై ప్రొడక్షన్ వ్యాల్యూస్, మరియు అద్భుతమైన విజువల్స్‌తో ఈ టీజర్ యూట్యూబ్‌లో 30 మిలియన్ల వ్యూస్‌ను దాటింది. ఇది ప్రేక్షకులకు గ్రాండ్ విజువల్ ఫీస్ట్‌లా ఉంది.

అంచనాలు పెంచుతున్న పాత్రలు
ఇప్పటికే శరత్‌కుమార్, మధుబాల, దేవరాజ్ వంటి నటుల పాత్రలను పరిచయం చేస్తూ పోస్టర్లను విడుదల చేశారు. బ్రహ్మాజీ గవ్వరాజు పాత్రలో, ముఖేష్ రిషి కంపడు పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలోని న‌టుల పోస్ట‌ర్లు రిలీజ్ చేయ‌డంతో సినిమాపై అంచనాలను మరింతగా పెంచుతున్నాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment