కాజల్ ఫేవరేట్ హీరోలు వీళ్ళే! కామెంట్స్ వైరల్

కాజల్ ఫేవరేట్ హీరోలు వీళ్ళే! వైరల్ అవుతున్న పాత కామెంట్స్.

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు చక్రం తిప్పిన హీరోయిన్లలో కాజల్ అగర్వాల్ ఒకరు. తెలుగు, తమిళ భాషలలో వరుసగా అగ్ర హీరోలతో కలిసి నటించి స్టార్ డమ్ అందుకుంది. అందం, అభినయంతో వెండితెరపై ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. తక్కువ సమయంలోనే కోట్లాది అభిమానులను సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.

తెలుగు సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని హీరోయిన్ కాజల్ అగర్వాల్. మొదటి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత ఒక్కో సినిమాతో విజయాన్ని అందుకుంటూ తన క్రేజ్ మరింత పెంచుకుంటూ వచ్చింది. తక్కువ సమయంలోనే స్టార్ హీరోస్ అందరి సరసన నటించి మెప్పించింది. ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలకు జోడిగా కనిపించింది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే తన ప్రియుడు గౌతమ్ కిచ్లూను పెళ్లి చేసుకుని సినిమాలకు బ్రేక్ తీసుకుంది. ఈ దంపతులకు బాబు నీల్ కిచ్లూ జన్మించిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న కాజల్.. ఇప్పుడు సరైన అవకాశాల కోసం ఎదురుచూస్తుంది.

కెరీర్ ఫుల్ స్వింగ్‌లో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుని సినిమాలకు బ్రేక్ ఇచ్చిన కాజల్.. ఇప్పుడు రీఎంట్రీలో సరైన బ్రేక్ కోసం వేచి చూస్తుంది. గతేడాది భగవంత్ కేసరి సినిమాలో నటించింది. ఆ తర్వాత లేడీ ఓరియెంటెడ్ డ్రామా సత్య మూవీలో నటించింది. ఇవే కాకుండా ఇండియన్ 2 చిత్రంలోనూ కనిపించింది. అయితే పెళ్లి తర్వాత కాజల్ నటించిన సినిమాలు అంతగా హిట్ కాలేదు. దీంతో ఈ బ్యూటీకి అంతగా అవకాశాలు కూడా రావడం లేదు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది.

కాజల్ తన ఫేవరెట్ హీరో గురించి గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. కాజల్‌కు ఇష్టమైన హీరో ఎవరు అని అడగ్గా.. ఎన్టీఆర్ అని చెప్పింది. వీరిద్దరూ కలిసి ఇదివరకు రెండు సినిమాల్లో నటించారు. అలాగే ‘పక్కా లోకల్’ అనే సాంగ్ కూడా చేసింది. ఎన్టీఆర్ యాక్టింగ్ అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. అలాగే తమిళంలో విజయ్ దళపతి తన ఫేవరేట్ హీరో అని చెప్పుకొచ్చింది.

Join WhatsApp

Join Now

Leave a Comment