బీచ్‌లో బికినీలో కాజల్..

బీచ్‌లో బికినీలో కాజల్..


టాలీవుడ్‌లో ఒకప్పుడు వరుస హిట్స్‌తో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన కాజల్ అగర్వాల్ ఇటీవల సినిమాల విషయంలో కాస్త దూకుడు తగ్గించింది. అడపాదడపా మాత్రమే సినిమాలు చేస్తున్నప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది చందమామ.

తాజాగా, తన పుట్టినరోజు సందర్భంగా మాల్దీవ్స్‌లో కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేసిన ఫోటోలను కాజల్ సోషల్ మీడియాలో పంచుకుంది. బీచ్‌లో బికినీ ధరించి, చేతిలో డ్రింక్ పట్టుకుని హొయలు పోతున్న ఆమె ఫోజులు నెటిజన్లకు సెగలు పుట్టిస్తున్నాయి.

సముద్రంలో మునుగుతూ కాజల్ ఫోటోలకు ఫోజులిస్తుంటే, ఆమె అందాన్ని చూసి అభిమానులు మంత్రముగ్ధులవుతున్నారు. “హలో హలో లైలా.. మాయమైంది నా మనసు నీ వల్ల.. ఇంత అందమైన చందమామ.. మా కాజల్ ముద్దుగుమ్మ” అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఈ పుట్టినరోజు వేడుకల్లో కాజల్ అగర్వాల్ తన సోదరి, ‘ఏమైంది ఈవేళ’, ‘సోలో’ వంటి సినిమాలతో అలరించిన నిషా అగర్వాల్‌తో కలిసి బికినీలో సముద్రం ఒడ్డున తడిసి ముద్దవుతూ ఎంజాయ్ చేసింది.

ఉప్పునీటిలో సొరచేపల్లా, సముద్రంలో గోల్డెన్ ఫిష్‌ల్లా.. ఈ కాజల్ సిస్టర్స్ అందంలో ఒకరినొకరు పోటీ పడుతూ కనిపించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment