ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో కైకలూరు (Kaikaluru) కేంద్రంగా సాగుతున్న అంతర్రాష్ట్ర శిశు విక్రయాల (Child Trafficking) ముఠా గుట్టు రట్టు అయ్యింది. పిల్లలను (Kids) కిడ్నాప్ (Kidnap) చేసి విక్రయిస్తున్న వ్యవహారంలో కీలక సూత్రధారి అధికార జనసేన పార్టీకి (Jana Sena Party) చెందిన నాయకుడి తల్లి కావడం సంచలనం రేపుతోంది. ఈ కేసులోని నిందితురాలి తనయుడు జనసేన పార్టీతో పాటు కూటమిలోని పెద్దలతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు(Photos) వైరల్గా మారాయి. పిల్లల కిడ్నాప్, విక్రయం కేసులో అధికార జనసేన పార్టీకి లింకులు ఉండడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
ప్రధాన సూత్రధారి ‘ఈడేపల్లి ఆంటీ’
పోలీసుల దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం.. కైకలూరుకు చెందిన జనసేన నేత అబ్బిశెట్టి నాగబాబు (Abbishetty Nagababu) తల్లి అబ్బిశెట్టి వీరమ్మ (Abbishetty Veeramma) (అలియాస్ వీరాకుమారి, ఈడేపల్లి ఆంటీ) ఈ విక్రయాల ముఠాకు ప్రధాన సూత్రధారిగా వ్యవహరిస్తోంది. ఈమె నాయకత్వంలోని ముఠా ఇప్పటివరకు సుమారు ఐదుగురు చిన్నారులను విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో లోతైన దర్యాప్తు చేపట్టిన పోలీసులు, అబ్బిశెట్టి వీరమ్మతో పాటు ఆమెకు సహకరించిన మరో ఐదుగురిని అరెస్ట్ చేశారు.

నిందితుల వివరాలు ఇలా..
జనసేన పార్టీ క్రియాశీలక నాయకుడు అబ్బిశెట్టి నాగబాబు తల్లి అబ్బిశెట్టి వీరమ్మ ప్రధాన ముద్దాయి కాగా, ఆమెకు సహకరిస్తున్న గోపి, చిన్ని, రెడ్డెమ్మ (అలియాస్ చెల్లమ్మ), మాధురి, కలిత్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని పోలీసులు స్థానిక కోర్టులో హాజరుపరిచారు. నిందితులందరిపై కిడ్నాప్, మానవ అక్రమ రవాణా సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
విజయవాడ ముఠాతో సంబంధాలు
వీరమ్మ ముఠాకు విజయవాడకు (Vijayawada) చెందిన కురప్రసిద్ధ శిశు విక్రయాల నేరస్తురాలు ఫరీనాతో నేరుగా సంబంధాలు ఉన్నట్లు కైకలూరు రూరల్ సిఐ రవికుమార్ వెల్లడించారు. ఫరీనా (Farina) ఇప్పటికే ఐదు కేసుల్లో నిందితురాలిగా ఉండి, ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తోంది. జైల్లో ఉన్న ఫరీనాను విచారించేందుకు కైకలూరు పోలీసులు కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేశారు. ఈ ముఠా వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు? రాష్ట్రవ్యాప్తంగా వీరికి ఎక్కడెక్కడ లింకులు ఉన్నాయి? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తు కోసం నాలుగు ప్రత్యేక పోలీస్ బృందాలను రంగంలోకి దించారు.
“పిల్లల విక్రయాల కేసును అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నాం. నిందితులందరినీ కఠినంగా శిక్షించేలా ఆధారాలు సేకరిస్తున్నాం. పరారీలో ఉన్న ఇతరుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి” అని సిఐ రవికుమార్ (CI Ravikumar) తెలిపారు.









