శ్రీకాంత్ పెరోల్ తిర‌స్క‌రించిన అధికారి బ‌దిలీ.. వివాదంగా హోంశాఖ నిర్ణ‌యం

శ్రీకాంత్ పెరోల్ తిర‌స్క‌రించిన అధికారి బ‌దిలీ.. వివాదంగా హోంశాఖ నిర్ణ‌యం

క‌రుడుగ‌ట్టిన నేర‌స్తుడిగా పేరుపొంది, జీవిత ఖైదు శిక్ష అనుభ‌విస్తున్న రౌడీషీట‌ర్ (Rowdy-Sheeter) శ్రీకాంత్ (Srikant) పెరోల్ (Parole) అంశం ఆంధ్ర‌ప్ర‌దేశ్ (Andhra Pradesh) రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర వివాదాస్ప‌దంగా మారింది. పెరోల్ విష‌యంలో ఇద్ద‌రు టీడీపీ ఎమ్మెల్యేల(TDP MLA’s) సిఫార‌సు లేఖ‌లు (Recommendation Letters), హోంమంత్రి (Home Minister) ప్ర‌మేయంతోనే ఉంద‌ని వైసీపీ (YSRCP) ఆధారాలు బ‌య‌ట‌పెట్టింది. ఇదిలా ఉండ‌గా, తాజాగా రౌడీషీట‌ర్ శ్రీ‌కాంత్ పెరోల్‌ను తిర‌స్క‌రించిన హోంశాఖ జాయింట్ సెక్ర‌ట‌రీ కిషోర్‌ (Kishore)ను బ‌దిలీ చేయ‌డం వివాదాస్ప‌దంగా మారింది.

నిబంధనల ప్రకారం పెరోల్ మంజూరు చేయలేమని స్పష్టంగా పేర్కొంటూ జాయింట్ సెక్రటరీ కిషోర్ ప్రతిపాదనను తిరస్కరించారు. అయితే, శ్రీ‌కాంత్ పెరోల్ విష‌యం చ‌ర్చ‌నీయాంశంగా మారిన‌ కొద్ది రోజుల్లోనే ఆయనను హోంశాఖ నుంచి ఇంధన శాఖకు బదిలీ చేయడం అనుమానాలకు తావిస్తోంది. శ్రీకాంత్ పెరోల్ కోసం హోంమంత్రి అనితతో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు శ్రీధర్ రెడ్డి, సునీల్ కూడా లేఖ‌లిచ్చి స‌హ‌క‌రించార‌ని వైసీపీ ఆధారాలు బ‌య‌ట‌పెట్టింది. అయితే, హోంశాఖ‌ జాయింట్ సెక్రటరీగా ఉన్న‌ కిషోర్ నిబంధనలను చూపిస్తూ తొలిసారే పెరోల్‌ ప్రతిపాదనను నిలిపివేయడం గమనార్హం.

ఈ తరుణంలో అకస్మాత్తుగా ఆయనను బదిలీ చేయడం వెనుక రాజకీయ ఒత్తిడులు ఉన్నాయా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఉద్యోగులను టార్గెట్ చేస్తూ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా, హోంశాఖ జాయింట్ సెక్రటరీ కిషోర్ బదిలీ ఆర్డ‌ర్ కాపీ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుండ‌గా, ప్ర‌భుత్వ పెద్ద‌లు చేసిన త‌ప్పున‌కు అధికారుల‌ను బ‌లి చేస్తున్నార‌ని వైసీపీ ఆరోపిస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment