గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై వేధింపులు, అఘాయిత్యాలు పెచ్చుమీరుతున్నాయి. చిన్నారులకు, మహిళలకు రక్షణ కరువైంది. తాజాగా కడపలో జరిగిన ఘటన ఇందుకు ఉదాహరణగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప రవాణాశాఖలో ఓ మహిళా ఉద్యోగిపై లైంగిక వేధింపుల ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం.. భర్తలేని సమయంలో మహిళా ఉద్యోగి ఇంటికి వెళ్లి ఆమెపై లైంగిక దాడి చేశాడు. బాధిత మహిళ తన భర్తకు ఈ విషయం చెప్పడంతో, ఆయన కార్యాలయానికి వెళ్లి ఆ అధికారిని దేహశుద్ధి చేశాడు.
మంత్రివర్యుల స్పందన
ఈ ఘటనపై రాష్ట్ర రవాణాశాఖ మంత్రి తీవ్రంగా స్పందించారు. బాధితురాలికి న్యాయం చేయడం కోసం, సంబంధిత అధికారిని తక్షణమే విధుల నుంచి తొలగించి కేంద్ర కార్యాలయానికి సరెండర్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.