---Advertisement---

బాబు, ప‌వ‌న్‌ను ఇమిటేట్ చేసిన కేఏ పాల్‌.. వీడియో వైర‌ల్‌

బాబు, ప‌వ‌న్‌ను ఇమిటేట్ చేసిన కేఏ పాల్‌.. వీడియో వైర‌ల్‌
---Advertisement---

ప్ర‌జాశాంతి పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు కేఏ పాల్ ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై విరుచుకుప‌డ్డారు. సీఎం చంద్ర‌బాబు నాయుడు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌ను ఇమిటేట్ చేస్తూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఖ‌జానా ఖాళీ అయ్యింద‌ని క‌ప‌ట నాట‌కాలు, దొంగ ఏడుపులు ఏడుస్తున్న సీఎం చంద్ర‌బాబుకు హామీలు ఇచ్చే ముందు తెలియ‌దా..? రాష్ట్ర అప్పులు రూ.10 ల‌క్ష‌ల కోట్లు, రూ.13 ల‌క్ష‌ల కోట్లు అని అబ‌ద్ధం ఆడిన చంద్ర‌బాబుకు హామీలు అమ‌లు చేయ‌లేమ‌ని తెలియ‌దా..? అని ప్ర‌శ్నించారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాష్ట్రాన్ని స‌ర్వ‌నాశ‌నం చేస్తున్నాడ‌ని, అందుకే ప‌వ‌న్ ఫ్యాన్స్ ఆయ‌న్ను తిట్టిపోస్తున్నార‌ని కేఏ పాల్ వ్యాఖ్యానించారు.

30 వేల మంది అమ్మాయిలు ఎక్క‌డ‌..?
‘జగన్.. నువ్వు రూ.50 మందుని రూ.150కి అమ్ముతున్నావ్‌.. కడుపులు కొడుతున్నావ్ అని మందు గురించి కూడా ప‌వ‌న్ తమ్ముడు కామెంట్స్ చేశాడు. ఇప్పుడు కూట‌మి ప్ర‌భుత్వంలో వాళ్లు దారుణంగా కల్తీ మద్యం అమ్ముతున్నారు. 30 వేల మంది మ‌హిళ‌లు, అమ్మాయిలు మిస్సయ్యారు, మేము రాగానే తీసుకువ‌స్తాం’ అని మాట్లాడిన ప‌వ‌న్ క‌ళ్యాణ్.. ఒక్కరినైనా తీసుకొచ్చారా? వాళ్ల గురించి ఒక్క‌సారైనా మాట్లాడాడా..? అని ప్ర‌శ్నించారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment