కిరణ్ అబ్బవరం (Kiran Abhavaram)హీరోగా నటించిన ‘కే ర్యాంప్’ (K-Ramp) చిత్రం దీపావళి సందర్భంగా విడుదలైంది. ఈ సినిమా పాజిటివ్ టాక్ సంపాదించుకోవడమే కాక, కిరణ్ అబ్బవరంకి మరో విజయాన్ని అందించింది. థియేటర్లలో మంచి కలెక్షన్స్ రాబట్టిన ఈ చిత్రం, ఎట్టకేలకు ఓటీటీ(OTT) ప్రేక్షకులను పలకరించేందుకు రంగం సిద్ధం చేసుకుంది.
నవంబర్ 15వ తేదీ, అంటే వచ్చే శనివారం నాడు, ఈ సినిమా ప్రముఖ ఓటీటీ వేదికైన ‘ఆహా’(Aha)లో స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించి ‘ఆహా’ త్వరలోనే అధికారిక ప్రకటన చేయనుంది. జైన్స్ నాని దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి రాజేష్ దండా నిర్మాతగా వ్యవహరించారు.
28 రోజులకే ఓటీటీలోకి: హాట్ టాపిక్!
‘కే ర్యాంప్’ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసుకున్నప్పటికీ, కేవలం 28 రోజులలోపే ఓటీటీలోకి రావడం ఇప్పుడు పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. సినిమా విడుదల తర్వాత నిర్మాత రాజేష్ దండా చేసిన కొన్ని వ్యాఖ్యలు, ఆ తర్వాత ఆయన క్షమాపణలు చెప్పడం కూడా వైరల్ అయ్యాయి.
అయితే, కలెక్షన్స్ బాగున్నా, ఇంత త్వరగా ఓటీటీలోకి తీసుకురావడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భవిష్యత్తులో ఈ తరహా చిన్న ఓటీటీ విండో విధానం, పెద్ద సినిమాల వసూళ్లపై కూడా ప్రభావం చూపి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని సినీ వర్గాలు అభిప్రప్రాయపడుతున్నాయి.








