జూపల్లి కృష్ణారావు మంత్రి పదవిపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ట్విట్టర్ వేదికగా చేసిన పోస్టు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ప్రెస్‌మీట్ నిర్వహించిన మంత్రి జూపల్లి కృష్ణారావు నెలకు 6,500 కోట్ల రూపాయలు ఈనాటి ప్రభుత్వం ముఖ్యమంత్రి కేటీఆర్ అని వ్యాఖ్యానించారు. వెంటనే తేరుకొని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.
దీంతో కాంగ్రెస్ ప్రభుత్వంలోని కేబినెట్ మంత్రే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరిచిపోయారని సోషల్ మీడియాలో కామెంట్లు వైరల్‌గా మారాయి. ఈ వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. నా మాటలను గుర్తించండి. ఈ తప్పుకు మంత్రి జూపల్లి త్వరలో కేబినెట్ నుంచి బర్తరఫ్ కాబోతున్నారు అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
Mark my words. Minister Jupalli is going to be sacked from cabinet soon for this mistake 😄 https://t.co/5h9bBelGhX
— KTR (@KTRBRS) February 18, 2025
గతంలో పుష్ప-2 ప్రీరిలీజ్ ఈవెంట్‌లో అల్లు అర్జున్ సీఎం రేవంత్‌రెడ్డి పేరు మరిచిపోయిన విషయం తెలిసిందే. ఆ తరువాత సీఎం పేరు మరిచిపోయినందుకు కక్షతోనే బన్నీని అరెస్టు చేశారనే అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. తెలుగు మహాసభల్లోనూ యాంకర్ బాలాదిత్య సీఎం పేరును తప్పుగా పలికారు. అప్పుడు కూడా ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. తాజాగా కేబినెట్ మంత్రే సీఎం పేరు మర్చిపోవడం చర్చనీయాంశంగా మారింది.








