ముదురుతున్న వివాదం.. జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్ ధ‌ర్నా

ముదురుతున్న వివాదం.. జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్ ధ‌ర్నా

అనంతపురం (Anantapuram) అర్బన్ టీడీపీ (TDP) ఎమ్మెల్యే(MLA) దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ (Daggubati Venkateswara Prasad) చేసిన జూనియర్ ఎన్టీఆర్‌ (Junior NTR)పై అనుచిత వ్యాఖ్యలు పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నాయి. ఎమ్మెల్యే ఆడియో(MLA Audio)) సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానుల్లో(Fans) ఆగ్రహం ఉధృతమైంది. దీంతో అనంతపురం ఎమ్మెల్యే ఆఫీస్(MLA Office) ముందు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు భారీగా చేరి ధర్నా (Protest) చేపట్టారు. టీడీపీ నేత‌లు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల‌ను (Flex Banners) చించిప‌డేశారు.

“వార్ 2” సినిమా షోలు నిలిపివేస్తానన్న హెచ్చరిక
అభిమాన సంఘం నేత ధనుంజయ నాయుడు (Dhanunjaya Naidu) తో ఎమ్మెల్యే ప్రసాద్ జరిపిన ఫోన్ సంభాషణలో “వార్ 2”(War 2) సినిమాను ఆడనివ్వనని, షోలు నిలిపివేయిస్తానని హెచ్చరించారు. అంతేకాకుండా బూతులతో ఎన్టీఆర్‌ను, ఆయ‌న త‌ల్లిని కించ‌ప‌రిచేలా దూషించినట్లు ఆడియోలో వినిపించడంతో అభిమానులు తీవ్రంగా మండిపడ్డారు. “బహిరంగ క్షమాపణ చెప్పకపోతే పరిస్థితులు అదుపులో ఉండవు” అని స్పష్టం చేశారు.

అభిమానుల హెచ్చరికతో ఉద్రిక్తత
అభిమానులు ఎమ్మెల్యే ఆఫీస్ వద్ద ఫ్లెక్సీలు చించివేస్తూ ఆందోళన కొనసాగించారు. “ఎన్టీఆర్ జోలికి వస్తే సహించం”, “మేం వేసిన ఓట్లతోనే ఎమ్మెల్యే గెలిచావు” అంటూ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ గందరగోళం మధ్య ఎమ్మెల్యే అనుచరుడు గంగారాం “ప్రసాద్ తిరిగి వచ్చిన తర్వాత బహిరంగ క్షమాపణ చెబుతారు” అని హామీ ఇచ్చిన‌ప్ప‌టికీ ఫ్యాన్స్ కోపం త‌గ్గ‌లేదు. ఇది రాష్ట్ర వ్యాప్తం ఆందోళ‌న‌కు కార‌ణమైంది. విజ‌య‌వాడ‌ (Vijayawada)లో టీడీపీ ఎమ్మెల్యే దిష్టిబొమ్మ‌ను (Effigy) ద‌గ్ధం చేశారు. తెలంగాణ‌లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సైతం ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్య‌ల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ ద‌గ్గుబాటి ప్ర‌సాద్ ఫ్లెక్సీల‌ను చెప్పుల‌తో కొడుతూ నిర‌స‌న వ్య‌క్తం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment