జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. స్టార్ క్యాంపెయినర్‌గా కేసీఆర్

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. స్టార్ క్యాంపెయినర్‌గా కేసీఆర్

జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉపఎన్నిక  (By-Election)లో పోటీ తీవ్రమవుతున్న నేపథ్యంలో, బీఆర్‌ఎస్(BRS) అధినేత కేసీఆర్(KCR) స్వయంగా రంగంలోకి దిగనున్నారు. రేపు (గురువారం) ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేటీఆర్, హరీష్ రావు సహా ఇన్‌ఛార్జ్‌లతో ఆయన కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో ఎన్నికల వ్యూహాలపై చర్చించి, పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు. బీఆర్‌ఎస్ స్టార్ క్యాంపెయినర్‌  campaigner)  (Star Cmpaigner)గా కేసీఆర్ ప్రచారంలో పాల్గొనాలని కేటీఆర్, హరీష్ రావు కోరడంతో, ఎన్నికల ప్రచారం మరింత ఉత్కంఠగా మారనుంది.

మరోవైపు, నామినేషన్ల గడువు నిన్నటితో ముగిసింది. మొత్తం 211 మంది అభ్యర్థులు 321 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. చివరి రోజు తెల్లవారుజామున 3 గంటల వరకు స్వీకరణ కొనసాగింది. ఈరోజు (బుధవారం) ఉదయం 11 గంటలకు నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ) జరగనుంది. ఎల్లుండి (శుక్రవారం) వరకు ఉపసంహరణకు గడువు ఉండడంతో, తుది పోటీదారులు ఎవరో త్వరలోనే తేలనుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment