జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సర్వం సిద్ధం

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సర్వం సిద్ధం

రేపు జరగబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం ఎన్నికల సంఘం (ఈసీ) అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. సెక్టార్ల వారీగా పోలింగ్ బూత్‌లను విభజించి, వాటికి అవసరమైన సామగ్రి (ఎక్విప్మెంట్) పంపిణీని చేపట్టింది. కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ రిటర్నింగ్ అధికారి సమక్షంలో జరుగుతోంది. సాయంత్రం లోగా 2,600 మంది ఎన్నికల సిబ్బందికి ఈవీఎంల పంపిణీని ఎస్ఈసీ పూర్తి చేయనుంది. ఈ రోజు రాత్రికి, భారీ పోలీసు బందోబస్తు మధ్య, ఈ ఈవీఎంలు పోలింగ్ బూత్‌లకు చేరుకోనున్నాయి.

పటిష్ట భద్రత మధ్య పోలింగ్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఏర్పాట్లను ఎన్నికల అధికారి ఆర్.వీ కర్ణన్ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి పోలింగ్ కేంద్రంపై డ్రోన్ కెమెరాతో నిఘా పెట్టనున్నట్లు తెలిపారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా పటిష్టమైన నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

ఈ ఉప ఎన్నిక బరిలో 58 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉండగా, వారి కోసం 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని ప్రకటించారు. ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు 2,400 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment