18 కిలోలు త‌గ్గిన ఎన్టీఆర్‌.. ఎందుకో తెలుసా..?

18 కిలోలు త‌గ్గిన ఎన్టీఆర్‌.. ఎందుకో తెలుసా..?

మన టాలీవుడ్‌ హీరోలు పాత్రల కోసం ఎంతవరకైనా వెళ్తారు. నటనకంటే ఎక్కువగా, పాత్రలో పూర్తిగా ఒదిగిపోవడం కోసం శారీరకంగా, మానసికంగా వారు తీసుకునే కష్టాలు అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. ఇప్పుడు అదే దారిలో జూనియర్ ఎన్టీఆర్ కూడా సినిమా కోసం, ముఖ్యంగా త‌న ఫ్యాన్స్ కోసం డెడికేష‌న్ చూపిస్తున్నారు.

18 కేజీల వెయిట్ లాస్!
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ మూవీ కోసం తారక్ దాదాపు 18 కేజీలు తగ్గారని సినీ వర్గాల్లో చర్చ. పాత్రలో ఒదిగిపోవడానికి ఎన్టీఆర్ రోజూ మూడు గంటల పాటు వర్కౌట్స్ చేయడం, అలాగే హై ప్రోటీన్ డైట్ ఫాలో అవ్వడం వంటి మార్పులతో తనను తానే మార్చుకున్నాడు.

తారక్ డెడికేషన్..
ఇలాంటి ట్రాన్స్‌ఫర్మేషన్‌లు తారక్ నటుడిగా ఉన్న స్థాయిని మళ్ళీ మళ్ళీ రుజువు చేస్తున్నాయి. ఒక్కో సినిమాతో తనను తాను మళ్లీ డిఫైన్ చేసుకుంటున్న తారక్, ‘డ్రాగన్’లో కూడా అదే మేజిక్ రిపీట్ చేయనున్నారని అంచనాలు బలంగా ఉన్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment